విజయనగరం జిల్లాలో నేరాలు అదుపులో ఉన్నాయని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా యం పాటిల్ తెలిపారు. రాజాం నియోజకవర్గం లోని రేగిడి ఆముదాలవలస పోలీస్ స్టేషన్ ను సోమవారం ఆమె తనిఖీ చేశారు. చీటీల పేరుతో మోసం చేసిన వారి నుంచి నగదు రికవరీ చేస్తామన్నారు. చీటీల మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 72 పోలింగ్ కేంద్రాలకు 39 రూట్లు ఏర్పాటు చేసి ఒక ప్లేయింగ్ స్క్వేడ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.