రేగిడి ఆముదాలవలస మండలం ఉంగరాడ మెట్ట గురుకుల పాఠశాలలో ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలలో భాగంగా పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ దీపిక ఎం. పాటిల్ పరిశీలించారు. సోమవారం 26, 27 పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. మండలంలో 1408 ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. 200 మీటర్ల లోపు టెంట్ లు వేయరాదన్నారు. ప్రిన్సిపాల్ బుచ్చిరాజు, సిఐ ఉపేంద్ర, ఎస్ఐ శ్రీనివాసరావు ఆమె వెంట పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa