ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కలిశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో యువగళం పాదయాత్రలో రాధా పాల్గొన్నారు.. లోకేష్‌తో కలిసి నడిచారు. ఇద్దరు యువ నేతలు ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయపరమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా వంగవీటి రాధా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేన పార్టీలోకి వెళతారని సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం లోకేష్‌ను కలవడంతో టీడీపీలోనే కొనసాగుతాననే సంకేతాలు పంపించారనే చర్చ జరుగుతోంది.