అనంతపురం జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థినితో హెడ్మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై టూటౌన పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, హెడ్మాస్టర్ ప్రభంజనను అరెస్ట్ చేశారు. కోర్టు రోడ్డు సమీపంలోని ఆ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రభంజన, బాధిత విద్యార్థిని ఉన్న తరగతికి కంప్యూటర్ సైన్స బోధించేవాడు. ఈ క్రమంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు కొన్ని రోజులుగా పాఠశాలకు వెళ్లలేదు. అనుమానం వచ్చి.. కుటుంబ సభ్యులు, బంధువులు ఆరా తీశారు. దీంతో విద్యార్థిని వారికి తన సమస్య గురించి తెలిపింది. విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఆ పాఠశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రభంజనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న టూటౌన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.