జగనన్న ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌తో మహిళలకు భద్రత, భరోసా వచ్చిందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి మహిళకు దిశ యాప్ అండగా నిలుస్తోందని చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట పురస్కారంతో యూనివర్సిటీ నిర్వహకులు రోజాను సత్కరించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. పక్కరాష్ట్రంలో జరిగిన ఘటనను చూసి.. మన రాష్ట్రంలోని ఆడపడుచుల రక్షణ కోసం దిశ చట్టం చేసిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని, అంతేకాకుండా ఆపదలో ఉన్నవారిని క్షణాల్లో ఆదుకునేలా దిశ యాప్‌ను కూడా తెచ్చారన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలన్నారు.