సీపీఎ్‌సకు మరో ప్రత్యామ్నాయం ఓపీఎస్ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. సోమవారం నెల్లూరులో జరిగిన ఆపస్ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘సీపీఎస్ రద్దు గురించి ప్రతిపక్ష నేతగా జగన్‌రెడ్డి తన పాదయాత్రలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయంగా జీపీఎస్ అనడం ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదం తెలియచేశారు. కార్యక్రమంలో ఏబీఆర్ఎ్సఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శివానంద, జాతీయ సంఘటన మంత్రి గుంత లక్షణ్ జీ, ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలాజీ, రాష్ట్ర, జిల్లా నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.