ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలంలోని కాజ గ్రామంలో జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ రంజిత్‌కుమార్, సీఎస్‌డీటీ మురళీమోహన్ తెలిపారు. గొల్లప్రోలు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తూర్పుతాళ్ల నుంచి గొల్లప్రోలుకు వ్యాన్‌లో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నట్టు చెప్పారు.