మనోజ్, మౌనిక దంపతులు సోమవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మనోజ్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.... తమ ప్రేమ గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత తన షూటింగ్ మొదలైందన్నారు. ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుంచి తిరిగి మొదలుపెడుతున్నట్టు తెలిపారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం ఉందని, అదే తమను కలిపిందన్నారు. మౌనికరెడ్డి తనకు 12 ఏళ్లుగా తెలుసన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్దానని, ఆ ఇబ్బందుల నుంచి మౌనిక బయటకు తీసుకువచ్చిందన్నారు. శివుడి ఆజ్ఞతో పెద్దలందరూ కలిసి తమ పెళ్లి చేశారన్నారు. ‘కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు.