ఏపీఎస్ ఆర్టీసీకి సొంత బస్సులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2,736 కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం జగన్ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 572 కోట్ల అంచనా వ్యయంతో 1500 కొత్త డీజిల్ బస్సులు మరియు 1000 జిసిసి మోడల్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నారు. 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు తెలిపారు. కొత్తగా 36 అద్దె బస్సులను తీసుకోనున్నారు.