ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామన్నారు.ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రూ.3 వేల కోట్ల బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటారని అన్నారు. చిన్న చిన్న సమస్యలను అందరం కలిసి పరిష్కరించుకుంటామని సజ్జల స్పష్టం చేశారు.ఈరోజు జరిగిన చర్చల్లో కొన్ని సమస్యలు పరిష్కారమైనట్లు వెల్లడించారు.