మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు? అని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా లిఖితపూర్వకంగానే ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీ ఏం చెబుతుందో చూస్తామని, అప్పటివరకూ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని బొప్పరాజు ప్రకటించారు.