దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా చాలా ప్రాంతాల్లోని ప్రజలు రవాణా, వైద్యం వంటి కనీస సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పాలమామిడికి చెందిన దేవికి పురిటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్ రావడానికి రోడ్డు మార్గం లేక బైక్ పై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం.