మార్చిలోనే ఎండలు దంచుతున్నాయి. ఈ క్రమంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు తరచూ నీటిని తీసుకోవడం సహా నిమ్మరసం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెంచడం సహా ఎండ నుంచి రక్షిస్తుందని చెబుతున్నారు. అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దోసకాయ, పుదీనా, తాజా కూరగాయల జ్యూస్ వంటివి తాగడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ కలుగుతుందంటున్నారు.