తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని దుష్టశక్తులు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. ప్రజలు లబ్ధిపొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.