మహిళల కంటే పురుషుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు 2 రెట్లు ఎక్కువని గతంలో పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే, పురుషులు, మహిళల్లో గుండెపోటు సంకేతాలు, లక్షణాలు భిన్నంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జీవన శైలి, పని ఒత్తిడితో మెట్రో పాలిటన్ నగరాల్లో నివసించే మహిళల్లో ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో ధూమపానం, గర్భ నిరోధక మాత్రలు అధికంగా వాడడం ముప్పును పెంచుతుందంటున్నారు.