పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మంగళవారం పివి ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల సర్కిల్ పరిధిలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. గుట్కా మట్కా పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహించిన నిర్వహించిన అట్టి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు.