గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం భవిష్యత్ తరాలకు ఒక వరమని జాయింట్ కలెక్టర్ రాజకుమారి మంగళవారం తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి రీ సర్వే పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. మేడికొండూరు మండలంలోని పొనుగుపాడు. వట్టిచెరుకూరు మండలంలోని లేమల్లెపాడు గ్రామాలలో సెక్షన్13 నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.