శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో వీధి కుక్కలు పట్టివేత కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభించినట్లు పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ గ్రామంలో వీధి కుక్కల సంచారం ఉండడంతో గ్రామస్తుల సహకారంతో సత్వరచర్యలు చేపట్టామన్నారు. పట్టుకున్న కుక్కలను అడవిలో వదిలి వేస్తామన్నారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని 50 కుక్కలను పట్టుకున్నట్లు తెలిపారు