గుంటూరు: ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న బాల కుటుంబ సభ్యులకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ రూ. 2, 32, 880 చెక్కును మంగళవారం అందజేశారు. గుంటూరు జిల్లా హోంగార్డు యూనిట్ లో పనిచేసిన బాల 2022 డిసెంబర్ 10వ తేదీన అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. గుంటూరు జిల్లా హోంగార్డుల ఒక్కరోజు వేత నాన్ని ఎస్పీ చేతుల మీదగా అందజేశారు.