మల్లూరమ్మ తల్లీ ప్రజలందరినీ చల్లంగా చూడుతల్లీ అంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు ప్రార్థించారు. చిన్నమండెం మండలం మల్లూరమ్మ జాతర సందర్భంగా బుధవారం వారు మల్లూరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రూ 1 కోటి నిధులుతో మల్లూరమ్మ ఆలయ విస్తరణ పనులు త్వరలో మొదలు కానున్నాయన్నారు. మల్లూరమ్మ ఆలయ ఖ్యాతిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.