మైదుకూరు టిడిపి కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా మహిళలు పురుషుల జీవితంలో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం అంకితం ఇస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని రాజకీయాల్లో సమిచిత స్థానం కల్పించాలని వ్యాఖ్యానించారు. సావిత్రిబాయి పూలే మహిళలకు నిదర్శనమని ఆమె జీవితం స్ఫూర్తి దాయకం అన్నారు. ఈ కార్యాక్రమలో టిడిపి పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు , రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనపాల జగన్ , క్లస్టర్ ఇంచార్జి ఆకుల కృష్ణయ్య, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, లక్ష్మీ నారాయణ ధనపాల రవి , కుర్రా రాధాకృష్ణ , పాశం మారుతి , చిన్నా , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.