కడప జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్ కవిత బుధవారం కడప పట్టణంలోని వివేకానంద మహిళా డిగ్రీ కళాశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 1975 లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవము ను గుర్తించిందని, 1996 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యము మహిళల హక్కులు, లింగ సమానత్వం గురించి అవగాహన పెంచడం, వివిధ రంగాలలో మహిళల యొక్క విజయాలు, మహిళా దినోత్సవ ప్రాముఖ్యత ను తెలియజేశారు. సమాజంలో మహిళల పట్ల వివక్షత, లింగ నిష్పత్తిపై అవగాహన, కుటుంబంలో మహిళ పాత్ర, వివాహ వయస్సు మొదలగు విషయాలను వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వివేకానంద మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డి ఎస్ ఆర్ మనోహర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.