పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదం చేస్తాయని సరుబుజ్జిలి జడ్పిటిసి ఎస్ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం సరుబుజ్జిలి మండలం రొట్టవలస సాయి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుపబడు చున్న ఐక్యప్ నర్సరీ ద్వారా జిల్లా ప్రాదేశిక సభ్యులు సురవరపు నాగేశ్వరరావు చేతుల మీదుగా కొత్తకోట సచివాలయ ఆవరణలో మరియు విలేజ్ పార్క్ లో మొక్కలు నాటుటకు బాదం మొక్కలను సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతున్నారని నర్సరీ చాలా బాగుందని సంతృప్తి వ్యక్తపరిచారు. సాడ్స్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ తాడేల రాజారావు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో మొక్కలు పెంచుటకు ఆసక్తిగల ప్రజా ప్రతినిధులు మరియు ప్రకృతి ప్రేమికులు ముందుకు వచ్చినట్లయితే మా వంతు సహకారంగా మొక్కలు అందజేస్తామని అన్నారు. గుడ్ వే ఫౌండేషన్ అధ్యక్షురాలు బూరగాపు ఉమామహేశ్వరి మాట్లాడుతూ మా సంస్థ ద్వారా అనేక పంచాయతీలకు ఉచితంగా మొక్కల పంపిణీ చేయడం జరిగిందని తద్వారా సత్ఫలితాలు వచ్చాయని అన్నారు. గ్రామాల్లో గల యువతీ యువకుల జన్మదిన సందర్భంగా మొక్కలు నాటుకు ఆసక్తి చూపినట్లయితే ఆ సంస్థ ద్వారా ఆయా ప్రాంతాలకు ఉచితంగా మొక్కలం చేస్తానని కావున మండలంలో గల వారందరూ మొక్కలు నాటుటకు భాగస్వామి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి నాగభూషణ్ రావు, జ్యోతికుమారి తదితరులు పాల్గొన్నారు.