మహిళా చట్టాలపై అవగాహన అవసరమని గజపతినగరం సివిల్ కోర్టు న్యాయమూర్తి బి. కనకలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో గల కస్తూరిబా గాంధీ విద్యాలయంలో బుధవారం బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు కేజీబీవీ ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు.