'స్త్రీ నిరంతరం మారుతున్న సాంకేతికతను అందుకోవాలని 'గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్ సంయుక్త అన్నారు. గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల లో బుధవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని వర్తమానం లో మారుతున్నా సాంకేతిక అధారిత ఉద్యోగ అవకాశాలు ను అందిపుచ్చుకొనే దిశగా వినియోగించుకోవాలని వివరించారు. చెడును కాకుండా మంచికోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల గణిత శాస్త్ర ఉపన్యాసాకులు అరుణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. పులఖండo శ్రీనివాసరావు, మనస్తవ శాస్త్ర ఉపాధ్యయని శోభ, ప్రైమరరీ శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ శారద, రేవతి, హేమలత, సునీత, సునీతరాణి తదితరులు పాల్గొన్నారు.