ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి దుప్పల. రవీంద్ర బాబు ప్రచారాన్ని ముమ్మరం చేసారు. బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఓటర్లను కలిసి రానున్న ఎన్నికలలో మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలపించవలసినదిగా కోరారు. బిజెపి పార్టీకి చెందిన దుప్పల రవీంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగారు తాను గెలిస్తే ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ఓటర్ లకు తెలిపారు. మొత్తానికి ఆయన ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇస్తున్నారు.