రేగిడి మండలంలో టేకు కలప అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతుంది. రాజాం. పాలకొండ ప్రధాన రహదారిలో సంకిలి, ఉంగరాడమెట్ట, బూరాడా మీదుగా రాజాం, పొందూరు టింబర్ డిపోలకు ట్రాక్టర్లతో టేకు రవాణా చేస్తున్నా రెవిన్యూ, పోలీసు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా టేకు కలప రవాణా జరగడంపై పలువురు విమర్శలు సంధిస్తున్నారు. వాస్తవముగా టేకు తరలిస్తే రెవిన్యూ శాఖ అనుమతులు తప్పనిసరి. అయితే ట్రాక్టర్లతో రవాణా చేస్తున్న పట్టించుకోకపోవడంతో అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టేకును చిన్నచెర్ల, తాటిపాడు జంక్షన్, రాజాము, పొందూరు పరిసర ప్రాంతాల్లోని టింబర్ డిపోలకు తరలిస్తున్నారు.