మహిళలు హక్కులను వినియోగించుకోవాలని ఆముదాలవలస జూనియర్ సివిల్ జడ్జి ఎస్. మణి తెలిపారు. బుధవారం బూర్జ మండలంలోని కొత్తపేట కొత్తపేట కదా ఆర్ట్స్ సంస్థ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అనేక చట్టాలు చేస్తుందని వాటిని వినియోగించుకోవా లని తెలిపారు. ఇందులో భాగంగా గర్భని నిరోధక చట్టం అలాగే బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని గురించి అందరూ తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆర్ట్స్ సంస్థ వారు మాట్లాడుతూ ఆకాశంలో సగమైన మహిళలకు ఆదివాసి ప్రాంతాలలో మహిళల అభివృద్ధికి మరియు జీవనోపాదులు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అలాగే వారి హక్కులను అమలు అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు. డాక్టర్ తమ్మినేని శ్రీలత మాట్లాడుతూ సీనియర్ శాస్త్రవేత్త అగ్రికల్చర్ వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారికి వారిని మును ముందు మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు డాక్టర్ భాగ్యలక్ష్మి కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం వారు మాట్లాడుతూ మహిళలకు వస్తువు విలువ ఆధారిత శిక్షణ ద్వారా మహిళలకు మరింత ఆదాయం వస్తుందని అలానే చిరుధాన్యాలతో మరింత అభివృద్ధి జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో అమరేశ్వరి హార్టికల్చర్ ఆఫీసర్ పాలకొండ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని మహిళల యొక్క వ్యవసాయపరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు మండల వ్యవసాయ అధికారి వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఉండాలని వారి మరింత చైతన్యమంత అవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మక వరహాలమ్మ చైర్మన్ మన్యం సహజ ఉత్పత్తిదాల కంపెనీ శ్రీహరిబాబు శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం అలానే ఆముదాలవలస బార్ నుండి లాయర్లు తమ్మినేని అన్నంనాయుడు, కింతలి త్రినాధరావు బాగా సేవలు అందించిన మహిళలకు నారీ శక్తి పురస్కార్ అవార్డులను ఆర్ట్స్ సంస్థ నుంచి అందించడం జరిగింది.