ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం జగన్‌ ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 06:12 PM

 ఏపీఎస్‌ ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం 2,736 కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం జగన్‌ ఆమోదించారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. మంగళవారం విజయవాడ ఆర్టీసీ హౌస్‌లోని సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.572కోట్ల వ్యయంతో 1,500 కొత్త డీజిల్‌ బస్సులు, గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ / ఓపెక్స్‌ మోడల్‌ వెయ్యి ఎలక్ర్టానిక్‌ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మరో 200 బస్సులను డీజిల్‌ నుంచి ఎలక్ర్టికల్‌ బస్సులుగా మార్చనున్నామన్నారు. త్వరలో కర్ణాటక తరహాలో 15 మీటర్ల అంబానీ బస్సుల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మరో 36 అద్దె బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన డీజిల్‌ కొనుగోలుకు సంబంధించి వివరణ ఇస్తూ ఆయిల్‌ కంపెనీల నుంచి నేరుగా ఏడాదికి రూ.2,500 కోట్ల విలువల 27 కోట్ల లీటర్ల హెచ్‌ఎ్‌సడీ ఆయిల్‌ను తీసుకుంటున్నామన్నారు. డిపోల వారీగా ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీల నుంచి టెండర్లు పిలుస్తామన్నారు. ఈ టెండర్లలో రిటైల్‌ వ్యాపారులు పాల్గొనే అవకాశం లేదన్నారు. గతేడాది ఫిబ్రవరి 16 నుంచి బల్క్‌ అయిల్‌ రేట్లు బాగా పెరిగాయని, 2013లో మాత్రమే ఇలా భారీగా ధరలు పెరిగిన సందర్భం ఉందన్నారు. ఈ కారణంగా రిటైల్‌ అవుట్‌ లెట్ల ద్వారా హైస్పీడ్‌ డీజిల్‌ అయిల్‌ కొనుగోలు చేశామని, దీనివల్ల కార్పొరేషన్‌కు లబ్ధి చేకూరిందన్నారు. గత ఫిబ్రవరి 22 నుంచి ఈ ఏడాది మార్చి 1వరకు రిటైల్‌ అవుట్‌లెట్ల ద్వారా కొనుగోలు చేసినందువల్ల రూ.593కోట్ల మేరకు సంస్థ ఆదా చేసిందన్నారు. ఈ నెల 2 నుంచి 129 డిపోలకు నేరుగా హెచ్‌ఎ్‌సడీ ఆయిల్‌ కొనుగోలుకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయవద్దని అన్ని డిపోల వారికి ఆదేశాలిచ్చామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa