ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి,,,భారీ సంఖ్యలో తరలివచ్చిన శ్రీవారి భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 06:12 PM

తిరుమమల  తిరుపతికి భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో ఉన్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి.. మంగళవారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఫాల్గుణ మాసం పుబ్బ నక్షత్రంలో పౌర్ణమినాడు ఈ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు. భక్తులు శేషాచల కొండల్లోని క్లిష్టమైన దారుల్లో భక్తితో తీర్థానికి చేరుకున్నారు. టీటీడీ ఇంజినీరింగ్‌, అటవీ విభాగ అధికారులు నడకదారిలో బారికేడ్లు.. కొన్ని ప్రదేశాల్లో ఇనుప వంతెనలు ఏర్పాటు చేశారు. భక్తులు తీర్థంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.


ఇటు.. శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో.. పౌర్ణమి వేడుకలలో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించారు. ఉదయం మూలవిరాట్టుకు అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరించి గరుడ వాహనంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు పూజలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa