అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపడుచులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ప్రెస్‌నోట్ విడుదలైంది. ‘‘శక్తి స్వరూపిణి స్త్రీ.. బహుకృత రూపిణి స్త్రీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ.. మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ.. ఇంతటి మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుంది. తల్లిగా.. తోబుట్టువుగా.. భార్యగా.. బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెల కట్టలేనివి. మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిది. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అని తెలియజేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పుకొంటుంటామని.. అది సత్యమన్నారు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయని తాను ధృడంగా విశ్వసిస్తానని జనసేన అధినేత తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa