దారి తప్పిపోయిన పిల్ల పులుల కోసం వాటి తల్లి పుల్లిని కనిపెట్టే పనిలో ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురంలో పెద్దపులి పిల్లలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. (నేషనల్ టైగర్ కన్సర్వే షన్అథారిటీ), Sop(స్టాండింగ్ఆపరేటింగ్ ప్రొసీజర్)నిపుణుల సూచనలతో ఆపరేషన్ తల్లి పులి కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో ప్రాజెక్ట్ టైగర్ ఎఫ్.డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.
నాలుగు పెద్ద పులి పిల్లలు లభ్యమైన ప్రాంతంలో అమర్చిన ట్రాఫ్ కెమెరాల పరిశీలించారు. నాలుగు పులిపిల్లల తల్లిని టీ-108గా గుర్తించారు. రెండు రోజులు గడుస్తున్న టీ108 ఆచూకీ లభ్యం కాకపోవడంతో తర్జన భర్జనలో ఉన్నారు అటవీశాఖ అధికారులు. ట్రాఫ్ కెమెరాల సంఖ్యను పెంచి తల్లి పులి జాడను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. అటవీ ప్రాంతంలో బెస్ క్యాంపులు, ట్రెంచ్, సాసర్ పిట్ తదితర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
పులి పాదముద్రల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. అవసరమైతే డ్రోన్ కెమెరాను కూడా వాడాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు పులికూనలకు తిరుపతి జూపార్క్ పశువైద్యుల పర్యవేక్షణలో సపర్యలు చేస్తున్నారు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. అలాగే తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్ నుంచి వదులుతారు.
అలాగే పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లలకు జన్మనిస్తాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి.. కానీ ఇక్కడ మాత్రం నాలుగు ఆడ కూనలు కావడం విశేషం. అంతేకాదు పుట్టిన వాటిలో కూడా రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే పెద్దపులి తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. కూనల్ని మనిషి తాకితే తల్లి తిరిగి తమ దగ్గరకు రానీయవు. ఇక్కడ కూడా పులి కూనలను స్థానికులు పట్టుకుని ఫొటోలు తీసుకున్నారు. అందుకే ఈ పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండదేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa