లోకేష్ పాదయాత్ర ఈరోజు 38వ రోజుకు చేరింది. పీలేరు నియోజవర్గంలోని చింతపర్తి విడిది కేంద్రం నుంచి నేటి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ను ప్రారంభించడానికి ముందు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన మహిళలకు పాదాభివందనం చేసి.. వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో మహిళలకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను విస్మరించారని యువనేత మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa