మీడియం రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదించే సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్‌ఎస్‌ఏఎం)ను భారత నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. డీఆర్‌డీవో, ఐఏఐ సంయుక్తంగా దీన్ని రూపొందించగా, భారత డైనమిక్స్ లిమిటెడ్ ఆత్మనిర్భర్ భారత్ కింద తయారుచేసింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ మీడియం రేంజ్ మిస్సైల్‌ను అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధనౌక పైనుంచి ప్రయోగించగా ఇది విజయవంతమైందని నేవీ మంగళవారం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa