రైలు ఇంజిన్‌పై చిరుతపులి కళేబరాన్ని గుర్తించిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా వనీ బొగ్గు గని క్షేత్రంలోని గుగ్గూస్ రైల్వే సైడింగ్ మంగళవారం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరం ఉండటంతో స్థానిక రైల్వే అధికారి రాజేష్‌సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం అటవీ అధికారులకు వారు విషయం తెలియజేయడంతో కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం చంద్రపూర్‌కు తరలించారు. కళేబరం లభించిన రైలు ఇంజిన్ చంద్రపూర్‌లోని సీటీపీఎస్ (చంద్రపూర్ థర్మల్ పవర్ స్టేషన్)కు బొగ్గును తరలించేందుకు మంగళవారం ఉదయం 7 గంటలకు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
ఆ సమయంలో గూడ్సు ఇంజిన్ పైభాగంలో కళేబరం కనిపించినట్టు రైల్వే అధికారులు చెప్పారు. తొలుత ఇంజిన్‌పై చిరుత నిద్రపోతుందేమోనని భావించారు. కానీ, ఎంతకీ దానిలో కదలికలు లేకపోవడంతో చనిపోయినట్టు గుర్తించారు. సీటీపీఎస్ తాడోబా పరిసరాల్లో ఉన్నందున రైలు వచ్చే క్రమంలో ఇంజిన్ పైనుంచి దూకబోయిన చిరుత హైటెన్షన్ విద్యుత్తు తీగలకు తగిలి ప్రాణం కోల్పోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
చంద్రపూర్ జిల్లాలోని తడోబా అటవీ ప్రాంతం సమీపంలో ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అటవీ ప్రాంతం పులులు, చిరుతలు, ఎలుగబంట్లు, ఇతర జంతువులకు నిలయం. పవర్ ప్లాంట్ ఉద్యోగులకు క్రూర మృగాలు నిరంతరం తారసపడతుంటాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట చంద్రపూర్ అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. తాజాగా, రైలు ఇంజిన్‌పై మరో కళేబరం గుర్తించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ జరిగిందా? ఏదైనా మిస్టరీ ఉందా? అనే అనుమానం కలుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa