ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం సముద్ర తీరంలోని నాచు పర్ర, డల్ల పర్ర ప్రాంతాల్లో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఇరవై రోజులుగా ఇదే సమస్య. తాజా పరిస్థితితో విసురు వలలతో చేపలను వేటాడే మత్స్యకారుల ఉపాధికి గండి పడింది. గుడ్లు పెట్టే దశలోని చేపలూ మృత్యువాత పడుతుండటంతో ఏడాది వరకు జీవనాధారం కష్టమేనని ఆందోళన బాట పట్టారు.