రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలోని సుబ్బయమ్మపేటలో నివాసం ఉంటున్న సిద్దనాటి బాపనమ్మ గృహం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూయిట్ గురయ్యి ఇల్లు దగ్ధం అయ్యింది. విషయం తెలుసుకుని రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ బుధవారం సాయంత్రం వారి నివాసం వెళ్లి భాదితులను పరామర్శించారు. నష్టం విలువ సుమారు ఒక లక్షా ముప్పైయి వేల రూపాయలు ఉందని ఈ మహిళ భర్త చనిపోయి వంటరిగా ఉంటుందని తెలుసుకున్న చందన ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఆమెకు నిత్యావసర వస్తువులను ఏర్పాటు చేసారు. ఆమె నివాసం వుండే విధముగా త్వరలోనే అక్కడే తాత్కాలికముగా షెడ్ నిర్మాణం చేసుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. చందనతో పాటు యన్. వి. శేఖర్, కన్వీనర్ తలారి ప్రసాద్, గూటం రాజు, నంబూరి రవి, పెయ్యాల రాజేష్, పెన్నాడ జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.