ఈనెల 14, 18 తేదీల్లో నులిపురుగుల నివారణ దినం (డీ వార్మింగ్ డే) నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ 19 ఏళ్ల లోపు పిల్లలకు నులిపురుగు నివారణ మందు వైద్యుల సలహా మేరకు తప్పక వేయాలని అన్నారు. బేటీ బచావో - బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా ప్రతి పీహెచ్సీలు, సంస్థల్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.