సమాజంలో మహిళల అభివృద్ధికి ఎంతోమంది త్యాగధనులు తమ జీవితాలు త్యాగం చేశారని నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ జి. ఆదిలక్ష్మి బుధవారం పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బుధవారం నర్సీపట్నంలో ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతపై దృష్టి పెట్టి అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరు మీదే అందజేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేసిందన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.