ఎర్రగొండపాలెం పట్టణంలోని అంగన్వాడి బీసీ సెంటర్ కు చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో టేబుల్ కుర్చీలను గురువారం బహుకరించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అప్పుడే కుటుంబంతో పాటు దేశ అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే స్థాయికి ఎదిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో విట్టా కోటేశ్వర్లు, టి వీరాచారి, జ్యోతి ప్రసాద్ రావు, సయ్యద్ నూరు భాష , పప్పి శెట్టి రవికుమార్, నాగయ్య, షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.