ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజక వర్గం ఒంగోలు మండలంలోని 26వ డివిజన్లో వైసీపీ నేతలు సమావేశం అయ్యారు. గురువారం నాడు ఈ సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాస్ రెడ్డిఆదేశాల మేరకు 13వ తారీకు జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పలనాటి శ్యాం ప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటు అభ్యర్థిస్తూ 26వ డివిజన్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు ఒంగోలు నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.