రణస్థలం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గ్రామ సచివాలయ ఉద్యోగికి తోటి ఉద్యోగులు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. కోటపాలెం గ్రామ సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. నరేంద్ర ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వైద్యానికి అధికంగా ఖర్చువుతున్న విషయం తెలుసుకున్న ఉద్యోగులంతా కలిసి పంచాయతీ కార్యదర్శి బి. లక్ష్మణ అధ్వర్యంలో రూ. 60 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని నరేంద్ర స్వగ్రామం ఆమదాలవలస మండలం నిమ్మతోర్లాడ గ్రామానికి వెళ్లి బుధవారం అందజేశారు.