క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షురాలిగా మాకిరెడ్డి ఆశాజాన్ ఎంపికయ్యారు. ఈ మేరకు సీమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో బుధవారం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చర్చి పెద్దలు, పాస్టర్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తామంతా ప్రేమపూర్వకమైన ప్రేమను దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డి నుంచి పొందుతున్నామని, ఆయన తన యుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నవరత్నాలను అందజేస్తూ ప్రజల మన్ననలు, దేవుడి ఆశీస్సులు పొందుతున్నారన్నారు. రాష్ట్రంలోని పదివేలమంది పాస్టర్లకు నెలకు రూ. 5వేలు చొప్పున గౌరవవేతనం ఇవ్వడం శుభదాయకమన్నారు. విదేశీ విద్యను పొందుతున్న క్రైస్తవ మైనారిటీ విద్యార్థులకు ఏడాదికి రూ. 5 లక్షలు, జెరూసలమ్ యాత్రకు క్రైస్తవులకు ఆర్థికసాయం వంటి ఎన్నో ఫలాలను అందిస్తున్నారన్నారు.