దశాబ్దాల అణిచివేతపై అలుపెరుగని పోరాటం చేసి, సాధించుకున్న మహిళా దినోత్సవ మూలాలు జగన్‌రెడ్డి అసమర్థ పాలన, ఉదాసీన వైఖరితో కనుమరుగవుతున్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో మహిళల భద్రతను గాలికొదిలేసి, రాష్ట్రాన్ని అత్యాచారాలకు కేరాఫ్ అడ్ర్‌సగా మార్చిన జగన్‌రెడ్డికి మహిళల పేరు ఉచ్ఛరించే అర్హత లేదని మండిపడ్డారు. బుధవారం ఆమె ఓ ప్రకటన చేశారు. ‘‘సీఎం నివసించే తాడేపల్లిలో వరుస అత్యాచారాలు జరుగుతున్నా.. తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మహిళలపై జరిగే నేరాల్లో దేశంలో మూడో వంతు ఏపీలో జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. దిశా పేరుతో ప్రచార ఆర్భాటం చేస్తున్న సీఎం... ఆచరణలో ఒక్క ఆడబిడ్డనైనా కిరాతకుల నుంచి కాపాడలేదు’’ అని సునీత విమర్శించారు.