‘ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా మన అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలవాల్సందే’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారా యణ స్పష్టంచేశారు. బుధవారం పార్వతీపురం పట్టణంలోని పట్టభద్రులు, వైసీపీనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్పై ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. ఐదురోజులే ఎన్నికలకు సమయం ఉందని, మీరంతా సైనికులా పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పరిక్షిత్రాజు పాల్గొన్నారు.