ఆగిరిపల్లి స్థానిక ఎస్సీ కాలనీలో నల్లమోతు జ్యోతి అనే మహిళపై దాడిచేసి గాయపరచిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఆగిరిపల్లి ఎస్సై ఎన్.చంటిబాబు తెలిపారు. బాధితురాలు చికిత్స కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జ్యోతి స్థానిక ఎస్సీ కాలనీలో చిల్డ్రన్ ఆఫ్ లైట్ అనాథ పిల్లల హాస్టల్లో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. వివరాల్లోకి వెళ్ళితే... సోమవారం ఉదయం హాస్టల్ వద్ద శాండి, దినేష్ అనే ఇద్దరు పిల్లలు హాస్టల్ చెత్త బైట పడేసి వస్తుండగా ఆగిరిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కూరపాటి అశోక్ ట్రాక్టర్‌పై అతి వేగంగా వచ్చి దినేష్‌ను పిలిచి కొడుతుండగా, జ్యోతి అడ్డుపడడంతో అశోక్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు ముగ్గురు జ్యోతిని, ఆమె కుమారుడు జాన్‌పై దాడి చేశారు. బాధితురాలు బంధువుల సాయంతో చికిత్స నిమిత్తం నూజివీడు ఆస్పత్రిలో చేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.