కర్నూలుజిల్లాలో రెండు రోజుల క్రితం ప్రకంపనలు రావడంతో 14 ఇళ్లలో గోడలు బీటలు వారాయి. ఐతే తాజాగా తుగ్గలి మండలం రాతన గ్రామంలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఆ ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో బుధవారం స్వల్ప ప్రకంపనలు రావడంతో మరో ఎనిమిది ఇళ్లలో గోడలు బీటలు వారాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కారణాలు అన్వేషించేందుకు కేంద్ర అధికారుల బృందం మంగళవారమే గ్రామానికి రావాల్సి ఉండగా వాయిదాపడింది. వారు రెండు రోజుల్లో రావచ్చని తహసీల్దార్ రవి తెలిపారు.