ఏలూరు లాకుల వద్ద గోడకూలడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఏలూరు లాకుల వద్దకు కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి అధికారులు ఎక్స్కవేటర్ను తీసుకువచ్చారు. ఏలూరు లాకుల వద్దకు దిగి వ్యర్థాలను తొలగిస్తూ ఆ ప్రాంతాన్ని చదును చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది. ఏ వాహనమైన అదుపుతప్పితే నేరుగా ఏలూరు కాల్వలోకి పడిపోయే పరిస్థితి. కూలిన గోడను పునఃనిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.