శ్రీకాకుళం జిల్లా, బొండపల్లి మండలంలోని కిండాం అగ్రహారంలో గల మామిడి తోటల్లో పులి పాదము ద్రలు గుర్తించడంతో కలకలం నెలకొంది. ఈ మేరకు గ్రామానికి సమీపంలో గల కొండకు ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో పులి అడుగులను బుధవారం స్థానికులు గుర్తించి అటవీశాఖాధి కారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ ట్రాకర్ అమర్‌తోపాటు బీట్ ఆఫీసర్లు కె.రామారావు, కేవీ వెంకటరమణ పరిశీలించి పులి పాదముద్రలుగా నిర్ధారించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు.