ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుల స్వీకరణలో ఈ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఆదేశాల మేరకు అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాల్లో ఈ కమిటీలను పక్కాగా ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో మహిళల ఫిర్యాదులు తగ్గుముఖం పట్టాయన్నారు. అంతర్గత కమిటీలు మహిళలకు రక్షణ కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa